హన్మకొండలోని వేయి స్తంభాల దేవాలయంలో భవిత శ్రీ చిట్ ఫండ్ ఆధ్వర్యంలో వచ్చేనెల 15 నుండి 21 వరకు అతి రుద్ర చండి యాగం నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా నేడు హన్మకొండలోని వేయ్యి స్ధంబాల గుడి దేవాలయంలో చండి యాగం పోస్టర్ ను విడుదల చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మేయర్ గుండా ప్రకాష్.
ఈసందర్భంగా చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభివృద్దికి కృషి చేస్తున్నారని తెలిపారు. శృంగేరి పీఠాధిపతులతో ఈ యాగం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత లోక కళ్యాణం కోసం అనేక దైవిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ యాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గోని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.
వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్ మాట్లాడుతూ.. 200మంది వేద పండితులతో అతి రుద్ర యాగం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తాం. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు రానున్నట్లు తెలిపారు.