అతనితో ఎలా కమల్ ?

29
- Advertisement -

భారతీయ సినీ చరిత్రలో లోకనాయకుడు కమల్ హాసన్ ది ఓ స్పెషల్ పేజీ. ఆ పేజీలో విన్యాసాలు, సాహసాలు, స్టైల్స్, మేనరిజమ్స్ వంటివి ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తుంటాయి. నటనలో వైవిధ్యం, చూపులో విలక్షణం, యాక్షన్‌లో మేనరిజం.. మొత్తంగా కమల్ హాసన్ ని ఆడియన్స్ ఎప్పుడూ కొత్తగానే చూస్తుంటారు. వచ్చేవాళ్లు వస్తూ వెళ్లేవాళ్లు వెళ్తూవున్నా – కమల్ హాసన్ స్పేస్ మాత్రం కమల్ హాసన్ కే ఉంది. లోకనాయకుడిగా తనకో ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కమల్ హాసన్ ఈమధ్యే విక్రమహోత్సవం చూపించాడు.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 ప్రాజెక్టు చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే – లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రాజెక్టుకూ క్లియరెన్స్ ఇచ్చేశాడు కమల్. ఇప్పుడు మరో దర్శకుడికి కూడా కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తమిళ వైవిధ్యమైన దర్శకుడు బాల చెప్పిన కథకు కమల్ ఓకే చెప్పాడట. సత్తావున్న దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు బాల సూపర్ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది.

పైగా హీరో సూర్య కూడా బాల ను తన సినిమా నుంచి తప్పించాడు. ఈ నేపథ్యంలో బాల, కమల్ హాసన్ కి కథ చెప్పడం, ఆ కథకు కమల్ హాసన్ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడమే ఇప్పుడు హాట్ టాపిక్. మరో విశేషమేంటంటే కమల్‌ హాసన్ ఈ ప్రాజెక్టుకు నిర్మాత కూడా అట. ఇక రాజకీయాల్లోకే.. అంటూనే కమల్ హాసన్ వరుస ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ -తనదైన స్టైల్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం కమల్ చేస్తున్న ఇండియన్ 2 పై కూడా పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి…

బాలయ్య కోసం కాజల్ కి 2 కోట్లు

నేచర్ క్యూర్ ఆస్పత్రిలో సోను..

ధృవ నచ్చతిరమ్..ఏడేళ్ల సినిమా

- Advertisement -