జన్మభూమి రుణం తీర్చుకుంటున్న ఆటా

94
- Advertisement -

అమెరికా తెలుగు అసోసియేషన్.. ఆటా సంస్థ తెలుగు సమాజానికి, సంస్కృతికి అపూరూప సేవలు అందిస్తోంది. విదేశాల్లో స్థిరపడిన మన తెలుగు ప్రజలు తమ మూలాలను మర్చిపోకుండా జన్మభూమి రుణం తీర్చుకుంటున్నారు. రవీంద్ర భారతి లో ఆట(అమెరికన్ తెలుగు అసోసియేషన్) కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,నటుడు రాజేంద్ర ప్రసాద్ తోపాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని’’ అని రాయప్రోలు సుబ్బారావు ఇచ్చిన పిలుపును మన తెలుగు ప్రజలు అందిపుచ్చుకున్నారు. అమెరికాలోని పదిలక్షల మంది తెలుగువారు తమ సంప్రదాయాలను, కళలు మర్చిపోకుండా కొనసాగిస్తున్నారు. అంతేకాదు వేల మైళ్ల దూరంలో ఉన్న సాటి తెలుగు ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారు.33 ఏళ్లుగా ఆటా సంస్థ తెలుగు సంస్కృతికి, సాహిత్యానికి సేవ చేయడం ఒక ఎత్తు, ప్రజా సంక్షేమానికి పాటుపడడం మరో ఎత్తు.

ఆటా తెలంగాణ, ఏపీలో ఈ నెల10 నుచి 30 వరకు ఇరవై రోజుల పాటు ‘ఆటా వేడకల్లో’ భాగంగా ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించింది. బిజినెస్ సెమినార్లు, ఎడ్యుకేషన్ సెమినార్లు, విద్యార్థులకు వీసాలపై అవగాహన, స్కాలర్ షిప్పులు, స్కూళ్లలో కంప్యూటర్లు, డిజిటల్ సామగ్రి, పేదలకు హెల్త్ క్యాంపులు..ఇన్ని కార్యక్రమాలను ఒక సంస్థ నిర్వహించడం ముదావహం.

మారుమూల అచ్చంపేట నల్లమల అడవుల్లోని చెంచు ప్రజలకు దుప్పట్లు, దుస్తులు అందించి పెద్ద మనసు చాటుకున్నఅందరికీ అభినందలు. ఎక్కడి అమెరికా? ఎక్కడి అచ్చంపేట? ఈ బంధాన్ని కలిపింది మన తెలుగు భాష, సంస్కృతి. వనపర్తి, సిద్దిపేట, గజ్వేల్ బాచుపల్లి.. తిరుపతి, వైజాగ్.. ఎన్నో చోట్ల మీరు వాటర్ ప్లాంట్లు, ఆరోగ్య శిబిరాలు మీ సొంత ఖర్చులో నిర్వహించారు. ఇది తెలుగు నేలపై మీకున్న ప్రేమకు నిదర్శనం.

రెండు మెట్లు పైకెక్కిన వాళ్లు తమకంటే కింద వాళ్లను, తమతో కలిసి జీవించినవాళ్లను ఆదుకోవడమే అసలైన ధర్మం. ప్రభుత్వ కార్యక్రమాలకు తోడుగా ఇలాంటి సంస్థలు కూడా సేవా కార్యక్రమాలు చేపట్టాలి. కొత్త రాష్ట్రమైన తెలంగాణకు పెట్టుబడులు రావడానికి ఆటా చేస్తున్న సేవలు ప్రశంసనీయం, బాసర ఐఐటీతో మీరు కుదుర్చుకున్న ఎంఓయూ.. విద్యార్థుల భవిష్యత్తకు బంగారు బాట వేస్తుందని ఆశిస్తున్నాను.తెలుగు సంస్కృతి, సాహిత్యాల ప్రచారానికి ఆటా చేస్తున్న సేవలు ఎంతో విలువైనవి. కాలానికి తగ్గట్లు ఇంగ్లిష్ చదువులు చదువుకుంటున్న యువతరానికి తమ మూలాలను గుర్తు చేయడం పెద్దలుగా మన బాధ్యత అన్నారు.

నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్‌కు జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రసాదం చేయడం అభినందనీయం.రాజేంద్ర ప్రసాద్ అనే ఓ నటుడు మనకు లేకపోయివుంటే తెలుగు వెండితెరపై నవ్వులు ఇంతగా పూచేవి కావు. రాజేంద్ర ప్రసాద్ తెలుగువారి చార్లీ చాప్లిన్. 50 ఏళ్ల నట ప్రస్థానంలో ఆయన అందుకోని విజయంలేదు. ఆబాల గోపాలన్ని నవ్వించిన మన ‘మాయలోడి’కి ఈ పురస్కారం ‘ముత్యమంత ముద్దు’ వంటిది.

హాస్యం మన జీవితంలో బరువును తగ్గిస్తుంది. ఆరోగ్యకర హాస్యం ఆలోచింపజేస్తుంది. రాజేంద్ర ప్రసాద్ హాస్యం ప్రత్యేకమైనది. రేలంగి, రమణారెడ్డి, రాజబాబు ఎవరికివాళ్లే గొప్పవాళ్లు. కానీ వాళ్లు హీరోలు కాదు. రాజేంద్ర ప్రసాద్ హీరో. ఒక పాత్రలో హీరో షేడ్‌ను, కమెడిన్ షేడ్‌ను అద్భుతంగా పండిచడం ఆయనకే చెల్లింది.
రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లో వినోదంతోపాటు సామాజిక సందేశం కూడా ఉంటుంది. డిష్యుం డిష్యుం ఫైటింగులతో కాకుండా తెలివితేటలతో విలన్లకు కనువిప్పు కలిగిస్తాడు. మన జీవితానికి ఓ నలుగురు మనుషులు ఎంత అవసరమో ‘ఆ నలుగురు’లో భావోద్వేగంతో చూపాడు.

‘అహనా పెళ్లంట’, ‘ఆ ఒక్కటీ అడక్కు’ వంటి గిలిగింతలు పెట్టే సినిమాలతోపాటు ‘ఆ నలుగురు’, ‘ఓనమాలు’ వంటి సామాజిక సందేశమున్న సినిమాలు రాజేంద్ర ప్రసాద్ నటవైదుష్యానికి అద్దంపడతాయి. మూవీ ఆర్టిస్ట్ అసోషియన్ అధ్యక్షుడిగా ఆయన తనతోటి ఆర్టిస్టుల సమస్యలను పరిష్కరించారు. ఆయనను ఆటా లైఫ్ అచీవ్’మెంట్ అవార్డుతో సత్కరించడం సంతోషంగా ఉంది. ఆయనకు, ఆటా నిర్వాహకులకు నా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Also Read:కాంగ్రెస్ వచ్చింది..కరెంట్ పోయింది

- Advertisement -