సమష్టిగా కృషిచేస్తేనే నవభారత్‌ సాధ్యం :మోదీ

157
At Niti Aayog meet, Modi says states need to work together for 'New
- Advertisement -

నీతి ఆయోగ్‌ పాలకమండలి మూడో సమావేశం ఆదివారం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీ, జావడేకర్‌, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌లు, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.15ఏళ్ల దీర్ఘకాలిక ప్రణాళిక ప్రధాన ఏజెండాగా జరుగుతున్న ఈ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. జీఎస్టీపై ఏకాభిప్రాయానికి రావడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

  At Niti Aayog meet, Modi says states need to work together for 'New
ఒకే దేశం, ఒకే ఆశయం, ఒకే నిర్ణయం ఇదే GST లక్ష్యమని పేర్కొన్నారు. ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు అని ప్రధాని ఈ సందర్భంగా నినాదాన్ని ఇచ్చారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణపై దేశవ్యాప్తంగా చర్చలు కొనసాగాలని కోరారు. అన్ని రాష్ట్రాలు, అందరు ముఖ్యమంత్రులు సమష్టిగా కృషిచేస్తేనే నవభారత్‌ సాధ్యమవుతుందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా అన్నారు.

ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్‌ పాలకమండలి సమావేశానికి పశ్చిమ బెంగాల్, ఢిల్లీ సీఎంలు మమతాబెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ గైర్హాజరయ్యారు. కాగా.. కేజ్రీవాల్‌ స్థానంలో డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఢిల్లీ తరఫున హాజరయ్యారు.

- Advertisement -