పెరులో విధ్వంసం.. 17 మంది మృతి 

49
- Advertisement -

పెరులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణల్లో 17 మంది మృతిచెందారు. దేశంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని, మాజీ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లోను జైలు నుంచి విడుదల చేయాలని ఆందోళనకారులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో జూలియాకా నగరంలో ఘర్షణలు చోటు చేసుకోగా 68 మంది గాయపడ్డారు.

 మూడు రోజుల పాటు రాత్రి వేళ్లలో ప్యునోలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు పెరు ప్రధాన మంత్రి అల్బర్టో ఒటారొలా చెప్పారు. పెరు కాలమానం ప్రకారం గత రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు మూడు రోజుల పాటు ఈ కర్ఫ్యూ ఉంటుందని చెప్పారు.

పలు ప్రాంతాల్లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు కఠిన చర్యలు తీసుకుంటున్నా యి. ఆందోళనకారులు రోడ్డులను బ్లాక్ చేస్తుండడంతో ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -