ట్విట్టర్ రివ్యూ: అశ్వథ్ధామ

358
shourya
- Advertisement -

యువ క‌థానాయకుడు నాగ‌శౌర్య హీరోగా ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `అశ్వ‌థ్థామ‌`. ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. హీరో నాగ‌శౌర్య‌నే ఈ సినిమాకు క‌థ‌ను అందించగా ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది.

అమ్మాయిల మీద జరుగుతున్న ఆరాచకా ఎదురొడ్డే కుర్రాడే కథే అశ్వథ్థామ . టైటిల్, ఫస్ట్ లుక్, ట్రైలర్‌లతో సినిమాపై అంచనాలు పెరిగిపోగా ప్రీమియర్ షో చూసిన వారు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

నాగశౌర్య ఫస్ట్ టైమ్ మాస్ అండ్ రగ్డ్ డ్ లుక్‌లో ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడని ట్విట్లు చేస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్,బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్‌గా నిలిచిందని … ఫస్టాఫ్ మొత్తం సస్పెన్స్ రైడ్‌గా సాగిందని నెటిజన్లు పేర్కొంటున్నారు. పవన్ వాయిస్‌తో సినిమా కావడం థ్రిల్లింగ్‌గా ఉందని మరికొంతమంది ట్విట్ చేస్తుంటే ఓవరాల్‌గా బొమ్మ హిట్టు అని పాజిటివ్ రేటింగ్ ఇచ్చేస్తున్నారు.

- Advertisement -