నాగచైతన్య-సమంతకు పిల్లలు పుట్టరట…!

217
online news portal
- Advertisement -

టాలీవుడ్ హీరో నాగచైతన్య, సమంత ప్రేమ,పెళ్లి గురించి కొంతకాలంగా వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు ఏం మాయ చేశావే చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ సినిమా నుంచి వీరిద్దరి స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది. త్వరలో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇటీవలె ఓ ఇంటర్వ్యూ మాట్లాడిన చైతూ… తమ కుటుంబంతో సమంత బాగా కలిసిపోయిందని అన్నాడు.

చైతూ సమంత జాతకాల్లో ఉన్న దోషాల దృష్ట్యా వారికి పిల్లలు పుట్టే అవకాశం లేదని ఓ ప్రముఖ జ్యోతిష్యుడు తెలిపారు. సహజసిద్ధంగా చైతన్య తండ్రికాలేడని…టెస్టు ట్యూబ్ బేబి ద్వారా తండ్రి అయ్యే విషయం చెప్పలేమన్నారు. అంతేకాదు సమంత నాగచైతన్యను చేసుకోవడం చైతుకే కలిసివచ్చే అవకాశం ఉందని వెల్లడించాడు.

naga-chaitanya-samantha

సమంతకు కుజదోషం…నాగచైతన్యకు కాల సర్ప దోషం ఉందని తెలిపాడు. వీరిద్దరి జాతకం దృష్ట్యా వీరికి పెళ్లైతే సంసారిక సుఖం ఉండదని వెల్లడించాడు. అంతేగాదు భార్యభర్తలు ఇద్దరు దూరం ఉండే అవకాశం ఉందని వెల్లడించాడు. ఇక పెళ్లి తర్వాత సమంతా సినిమాలకు దూరమవుతుందని….ఇండస్ట్రీ పేరు లేకుండా పోతుందని తెలిపాడు. అసలు వీరిద్దరి కాంబినేషన్ అసలు వర్కవుట్ కాదని తేల్చిచెప్పాడు. పెళ్లైన త్వరలో వీరు విడిపోవటం..గొడవలు కుటుంబ సమస్యలు తలెత్తుతాయన్నారు.

samantha

ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరలైంది. నెట్టింట్లో ప్రముఖ జ్యోతిష్యుడు చెప్పిన వీడియో హల్ చల్ చేస్తోంది. చైతు-సమంత గురించి చేదు వార్తతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే,గతంలో సమంత మతం మార్చుకుందున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య…తనకు మతాలతో సంబంధం లేదనీ, మనుషులనే చూస్తానంటూ చెప్పాడు. తాజాగావీరిద్దరి జాతకం గురించిన వార్తల నేపథ్యంలో చైతు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

- Advertisement -