స్వాతంత్ర్య దినోత్సవం..గ్రీన్ ఇండియా ఛాలెంజ్

98

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతోంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు అసోసిసేయన్ ఆఫ్ సోషల్ బియాండ్ బౌండరిస్ సంస్థ సభ్యులు. శాపూర్‌లోని జారండిలో 290 మొక్కలు నాటారు.

ఇప్పటివరకు ఈ సంస్థ ప్రతినిధులు 3160 మొక్కలు నాటగా ఈ మొక్కలు గిరిజన కుటుంబాలకు ఉపయోగపడతాయని వెల్లడించారు సంస్థ సభ్యులు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని తద్వారా పర్యావరణాన్ని కాపాడిన వారు అవుతామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్‌ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ గొప్ప కార్యక్రమం అని కొనియాడారు.