- Advertisement -
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను తన విలక్షణ నటనతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ దర్శకుడు అనుభవ్ సిన్హా దర్శకత్వంలో ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అస్సీ’ (ASSI).
ఈ సినిమా ఫిబ్రవరి 20న విడుదలకానుండగా, తాజాగా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ట్రైలర్‌ను గమనిస్తే తాప్సీ మరోసారి లాయర్ పాత్రలో కనిపించనుంది. దేశంలో రోజుకు 80 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారన్న నేపథ్యంతో, బాధితుల కోసం పోరాడే న్యాయవాదిగా ఆమె పాత్ర రూపొందింది.
అనుభవ్ సిన్హా–తాప్సీ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘ముల్క్’, ‘థప్పడ్’ చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ కోర్ట్‌రూమ్ డ్రామాలో నసీరుద్దీన్ షా, రేవతి, కని కుసృతి, మనోజ్ పహ్వా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
- Advertisement -

