సినిమా లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మిర్జాపూర్: ది మూవీ సినిమా అధికారిక విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఓటిటీలో అత్యంత ప్రజాదరణ పొందిన సిరీస్‌లలో మిర్జాపూర్ ఒకటిగా నిలిచింది. ప్రైమ్ వీడియోలో మూడు సీజన్లుగా ఘన విజయం సాధించిన మిర్జాపూర్ సిరీస్ తరువాత, దానిపై ఆధారంగా పూర్తి స్థాయి సినిమా రూపొందించాలని మేకర్స్ నిర్ణయించారు.
ఈ చిత్రానికి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించగా, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రితేష్ సిద్ధ్వానీ, ఫర్హాన్ అఖ్తర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం సెప్టెంబర్ 4, 2026న థియేటర్లలో విడుదల కానుంది.
Also Read:‘ధురంధర్’2లో యామీ గౌతమ్!
విడుదల తేదీ ప్రకటించిన వెంటనే అభిమానులు కామెంట్లలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దివ్యేందు శర్మ పోషించిన మున్నా త్రిపాఠి అలియాస్ మున్నా భయ్యా పాత్రపై అభిమానులు మరింత ప్రేమ చూపిస్తున్నారు. ఒకరు “మున్నా భయ్యా తిరిగి వచ్చాడు” అని కామెంట్ చేయగా, మరో అభిమాని “చివరికి మున్నా భయ్యాను మళ్లీ చూడబోతున్నాం” అంటూ ఉత్సాహం వ్యక్తం చేశారు.

