అసెంబ్లీ రద్దా.. నో ఛాన్స్!

53
- Advertisement -

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని, సి‌ఎం కే‌సి‌ఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళేందుకు సిద్దమౌతున్నారని.. ఇలా రకరకలుగా ప్రతిపక్ష పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ లు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా టి‌ఎస్ లో బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. అయితే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండబోవని, ముందస్తు కు వెళ్లాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని సి‌ఎం కే‌సి‌ఆర్, మంత్రి కే‌టి‌ఆర్ ఇప్పటికే చాలా సార్లు స్పష్టం చేశారు కూడా. అయినప్పటికి విపక్షాలు మాత్రం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజలను గందరగోళానికి గురి చేయడం మాత్రం మానడం లేదు.

అయితే అసలు ఏంటి ఈ ముందస్తు ఎన్నికల గోల.. ప్రతిపక్షాలు ఎందుకు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. అనే దానిపై విశ్లేషకులు చెబుతున్నా దాని ప్రకారం. గత ఎన్నికల టైమ్ లో ఎవరు ఊహించని విధంగా సి‌ఎం కే‌సి‌ఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన సంగతి తెలిసిందే. దాంతో ఈసారి కూడా కే‌సి‌ఆర్ అదే ప్లాన్ లో ఉన్నారని ప్రతిపక్ష వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గత ఎన్నికల్లో కే‌సి‌ఆర్ ను ఎదుర్కొనేందుకు అన్నీ పార్టీలు కూటమిగా ఏర్పడినప్పటికి… ప్రజా మద్దతు మాత్రం కే‌సి‌ఆర్ కె లభించింది. రాష్ట్రంలో సి‌ఎం కే‌సి‌ఆర్ ప్రవేశ పెడుతున్న రైతు బంధు, ఇంటింటికి నల్లా, ఉచిత కరెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తున్నాయి. దాంతో కే‌సి‌ఆర్ అందిస్తున్న సుపరిపాలనపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది.

అందువల్ల తిరుగులేని విజయాన్ని బి‌ఆర్‌ఎస్ కు గత ఎన్నికల్లో కట్టబెట్టారు. కాగా గత ఎన్నికల మాదిరి ఈసారి కూడా ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన.. విజయం మాత్రం బి‌ఆర్‌ఎస్ కే దక్కుతుందని ప్రతిపక్షాలకు కూడా బాగా తెలుసు.. అయినప్పటికి ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ప్రజలను గందరగోళ పరచడం తప్పా.. ఇంకోటి లేదు. ఇక తాజాగా ముందస్తు ఎన్నికల విషయంలో బి‌ఆర్‌ఎస్ నేత వినోద్ కుమార్ కూడా తనదైన రీతిలో స్పందించారు. ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని ప్రతిపక్షాలు చెప్పడం అర్థరహితమని, ఈ అంశంపై ఏదేదో ఊహించుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికి ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయడానికి తావు లేనప్పుడు.. ఇలా ఎన్నికల పేరుతో ప్రజలను గందరగోళానికి గురి చేసేందుకు ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితిలో లేరనేది అందరికి తెలిసిన విషయమే.

ఇవి కూడా చదవండి…

థరూర్ ట్వీట్‌పై బీజేపీ అభ్యంతరం..

దేశమంతా సుపరిపాలనే.. కే‌సీఆర్ లక్ష్యం!

ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా బడ్జెట్:హరీశ్

- Advertisement -