గాంధీల కోసం జైళ్లు రెడీ!

5
- Advertisement -

ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ. భారత్​లో గాంధీల కోసం చాలా జైళ్లు ఎదురు చూస్తున్నాయి మండిపడ్డారు. రాహుల్ గాంధీ కేవలం ఒక ఎంపీ, ఆయన ఒక ముఖ్యమంత్రిని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు.

ఈడీ రాబర్ట్ వాద్రా‌కు సంబంధించిన అనేక ఆస్తులను స్వాధీనం చేసుకుంది అని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ జైలులో నుంచే నన్ను అరెస్ట్ చేయగలడంట… ఆయన కేవలం ఒక ఎంపీ మాత్రమే. ఒక ముఖ్యమంత్రిని ఆయన ఎలా అరెస్ట్ చేస్తారు? అని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో హిమంత బిశ్వ శర్మను జైలుకు పంపాలి అని ఒకే ఒక ఎజెండాతో పోటీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చేసిన ప్రసంగాలను పోలీసులు పరిశీలించనున్నారని అసోం సీఎం తెలిపారు. విచారణలో రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే పాత్ర ఉన్నట్లు తేలితే పోలీసులు చర్యలు తీసుకుంటారు.

Also Read:TTD:20 నుండి పవిత్రోత్సవాలు

- Advertisement -