మొక్కలు నాటిన ఏషియన్ గ్రూప్స్ ఎండి సునీల్ నారంగ్

264
asian groups

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు తన పుట్టినరోజును పురస్కరించుకొని జూబ్లీహిల్స్ లోని తమ కార్యాలయం ఆవరణంలో మొక్కలు నాటిన ఏషియన్ గ్రూప్స్ ఎండి సునీల్ నారంగ్.

ఈ సందర్భంగా సునీల్ నారంగ్ మాట్లాడుతూ రోజురోజుకూ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మొక్కలను నాటి వాటిని సంరక్షించాలి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను మొక్కలు నాటడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి మా అందరికీ స్ఫూర్తినిచ్చిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తమ కార్యాలయంలో లో పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.