ఎనర్జిటిక్ హీరో రామ్-పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. సినిమా ఫస్ట్ లుక్‌తో ఇంప్రెస్ చేసిన పూరీ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుండగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆసక్తికర విషయాన్ని షేర్ చేశారు పూరీ.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గిఫ్ట్‌ను రామ్ తనకు అందించాడంటూ పూరీ ట్వీట్ చేశారు. ‘ఇస్మార్ట్ శంకర్’.. రామ్ నాకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీని కానుకగా ఇచ్చాడు. దీనిని కోపీ లువాక్ అంటారు. దీని గురించి గూగుల్‌లో వెతకండి. మీకు ఈ కాఫీ గురించి తెలిస్తే పిచ్చెక్కిపోతుంది. నేను ఈ కాఫీని తాగేస్తున్నాఅంటూ ఫొటోని షేర్ చేశారు పూరీ.
పూరీ ట్వీట్‌పై స్పందించిన రామ్..‘గూగుల్ చేయకండ్రి.. మ్యాటర్ తెలిస్తే దిమాగ్ ఖరాబ్ ఐతది’ అంటూ హింట్ ఇచ్చే ఎమోజీలను షేర్ చేశారు.
ఈ సినిమాలో రామ్ సరసన నభానటేష్,నిధి అగర్వాల్‌లు హీరోయిన్స్‌గా నటిస్తుండగా చార్మీ, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Google cheyakandri…matter teliste dhimaak kharaab ayitaadi! 🤯👈 – IS 😜 https://t.co/jPBt2aBmMM
— RAm POthineni (@ramsayz) February 5, 2019