- Advertisement -
చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తున్నాయి ఈరోజుల్లో. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు చిన్న సినిమాను ఆదరిస్తున్నారు. అదే జాబితాలోకి చేరబోతోంది “పరిచయం” సినిమా. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభించింది. పరిచయం సినిమా నైజాం రైట్స్ ను ఏషియన్ సినిమాస్ వారు ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నారు.
సినిమా సక్సెస్ పై ధీమాగా ఉన్నారు చిత్ర యూనిట్ సభ్యులు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్ హీరో,హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకి లక్ష్మికాంత్ చెన్నా దర్శకత్వం వహించగా రియాజ్ నిర్మాతగా వ్యవహరించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన “ఏమైందో మనసా” పాటకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. “పరిచయం” సినిమా జులై 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
- Advertisement -