దాయాదుల మధ్య మరోసారి ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఆసియా కప్‌లో భాగంగా భారత్ – పాక్ ఇవాళ మరోసారి తలపడనున్నాయి. ఇప్పటికే గ్రూప్ దశలో పాక్‌ను ఆల్‌రౌండ్ ప్రతిభతో మట్టికరిపించిన భారత్ సూపర్- 4 సమరానికి సిద్ధమైంది.
ఇప్పటివరకు సిరీస్‌లో ఓటమి ఎరుగని భారత్ ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి పాక్‌ను మట్టికరిపించేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పాక్‌పై అన్నిరంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించి గెలిచి తీరుతామని తెలిపారు.
ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ఫైనల్ బెర్తు దాదాపు ఖాయమవుతుండటంతో ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. గత మ్యాచ్ మాదిరే ముగ్గురు స్పిన్నర్లను ఆడిస్తారా.. లేక చాహల్, కుల్దీప్‌ల్లో ఒకరిని పక్కన పెట్టి మూడో పేసర్‌ను తీసుకుంటారా అన్నది ఆసక్తికరం.
లీగ్ మ్యాచ్‌లో పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో పాక్ ఉంది. ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ ఆమిర్, అనుభవజ్ఞుడు షోయబ్ మాలిక్ రాణిస్తే భారత్‌కు కష్టాలు తప్పవు. కాబట్టి మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.