దారులన్నీ ట్యాంక్ బండ్‌ వైపే

358
ganesh nimajjan
- Advertisement -

గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా సాగుతోంది. భక్తుల కోలాహలం మధ్య దారులన్ని నిమజ్జనం జరిగే ట్యాంక్ బండ్ వైపే ఉన్నాయి. వేలాది మంది ప్రజల మధ్య ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర కొనసాగుతోంది. వినాయక నిమజ్జనం భారీగా సాగే గణేశుల శోభాయాత్రకు వేలాది మంది పోలీసులతో భద్రత తదితర సమగ్ర ఏర్పాట్లు చేశారు.

ప్రధానం గా బాలాపూర్ నుండి హుస్సేన్ సాగర్ వరకు వచ్చే వాహనాలు, ట్రాఫిక్ ,18కిలో మీటర్ల రోడ్డు ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగిన చర్యలు చేపట్టారు. హుస్సేన్ సాగర్ లో ఇప్పటి వర కు 11 వేల విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు అధికారులు లెక్క తేల్చారు. సిటీలో మరో 14500 విగ్రహాలు నిమజ్జనాకి తరలి రానున్నాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిమజ్జనం కోసం ప్రత్యేకంగా 51 క్రేన్ లు ఏర్పాటు చేసిన అధికారులు, క్రేన్‌లకు రిలీజ్ హుక్ లు ఏర్పాటు చేశారు.

khairatabad ganesh

గణేష్ విగ్రహాలను ఉదయం ఆరు గంటల వరకు నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించి అందుకు అనుకూలంగా ముందుకుసాగనున్నారు. నిమజ్జనం కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు నాలుగు మౌంట్‌డ్ కెమారాలను ఏర్పాటు చేశారు.

శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. క్రేన్‌ నెంబర్‌-6 దగ్గర ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం చేయనున్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు 481 మంది సూపర్‌వైజర్లు, 719 మంది SFAలు, 8,597 మంది కార్మికులను నియమించారు. నిమజ్జన ప్రాంతాల్లో 27 ప్రత్యేక వైద్య శిబిరాలు, 92 మొబైల్‌ టాయిలెట్లు ఏర్పాటు చేశారు.

- Advertisement -