ఆసియా కప్…..భారత్ వర్సెస్ బంగ్లాదేశ్

242
Mashrafe Rohit-Sharma
- Advertisement -

ఆసియాకప్‌లో భాగంగా ఇవాళ రోహిత్ సేన బంగ్లాదేశ్‌తో తలపడనుంది. పాక్‌పై గెలుపుతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న టీమిండియా బంగ్లాదేశ్‌ను చిత్తుచేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. అయితే ఆటగాళ్ల గాయాలు భారత్‌ని కలవరపడుతున్నాయి. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, ఎడమచేతి వాటం స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌, పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ గాయాలతో టోర్నీకి దూరమయ్యారు.

పాక్‌తో మ్యాచ్‌ సందర్భంగా పాండ్య గాయపడగా ఇదే మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్ చేస్తూ స్పీన్నర్ అక్షర్ పటేల్ కూడా గాయపడ్డాడు. హార్ధిక్ స్ధానంలో దీపక్ చాహర్,అక్షర్ స్ధానంలో రవీంద్ర జడేజా జట్టులోకి వచ్చారు. శార్దూల్‌ స్థానంలో సిద్ధార్థ్‌ కౌల్‌ జట్టులోకి వచ్చాడు.

అఫ్ఘనిస్తాన్‌తో ఓటమి పాలైన బంగ్లా ఈ మ్యాచ్‌ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అఫ్గాన్‌ చేతిలో ఓడినప్పటికీ బంగ్లాతో పోరు తేలికేమీ కాదు. ఈ నేపథ్యంలో భారత్‌ ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. తమీమ్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, షకిబ్‌ అల్‌ హసన్‌, మహ్మదుల్లాలతో మంచి బ్యాటింగ్‌ లైనప్‌ ఆ జట్టు సొంతం. ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, రుబెల్‌ హుస్సేన్‌ రూపంలో నాణ్యమైన పేసర్లు కూడా ఉన్నారు. పరుగులు చేయడం భారత బ్యాట్స్‌మెన్‌కు మరీ అంత తేలికేమీ కాదు.

- Advertisement -