దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత్. అఫ్ఘన్‌తో మ్యాచ్ సందర్భంగా ఐదుగురు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి నివ్వగా ఈ మ్యాచ్ కోసం తిరిగి జట్టులోకి తీసుకున్నారు. దీంతో రోహిత్,ధావన్,భువి,బుమ్రా,చాహల్ తిరిగి జట్టులోకి వచ్చారు.
అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా కేఎల్ రాహుల్, మనీశ్ పాండే, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, సిద్ధార్థ కౌల్ ధోని నాయకత్వంలో ఆడగా ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ మినహా.. ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. మరోవైపు బంగ్లాదేశ్ జట్టు ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగింది.
ఫైనల్‌కి భారత్ తుది జట్టు ఇదే: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, మహేంద్రసింగ్ ధోని, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, చాహల్, జస్ప్రీత్ బుమ్రా