- Advertisement -
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత అశ్వినీదత్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఈ రోజు ఆయన సోదరి మరణించారు. ఆమె కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ టీం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. వై జయంతి కుటుంబానికి మీరు లేని లోటు పూడ్చలేనిది.. మిమ్మల్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటామంటూ ట్విట్టర్లో ఈ వార్తను పోస్ట్ చేశారు. కోవిడ్ కారణంగా పరామర్శకు కూడా ఎవరూ రావద్దని కోరారు కుటుంబ సభ్యులు.సోదరి మరణంతో అశ్వినీదత్ కూడా పూర్తి విషాదంలో మునిగిపోయాడు.
- Advertisement -