ఎన్టీఆర్ సినిమా పై షాకింగ్ కామెంట్స్

34
- Advertisement -

ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్ పేరు తెలియని వారుండరు. ఎందుకంటే, ఆయన నిర్మించిన చిత్రాలు బాక్సీఫీస్ వద్ద ఎన్నోరికార్డులు సాధించాయి. అయితే అశ్వినీదత్ నిర్మించిన ఒక సినిమా మాత్రం తీవ్ర నష్టాలు మిగిల్చిందట. దీంతో ఆయన ఇక సినిమాలే వదిలేద్దామనుకున్నారట. ఇంతకీ ఆ చిత్రం ఏంటో తెలుసా? జూ. ఎన్టీఆర్, ఇలియానా జంటగా నటించిన శక్తి సినిమా. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘శక్తి’ సినిమా వల్ల చాలా నష్టం జరిగిందని అశ్వినీదత్ అన్నారు.

అశ్వినీదత్ ఈ ఇంటర్వ్యూలో ఇంకా ఏం మాట్లాడాడు అంటే.. తన కెరీర్ బాగా నిరాశకు గురి చేసిన సినిమా ‘శక్తి’ అని, ఇక తనకి ఈ ఇండస్ట్రీ అనవసరం అని, సినిమాలు వదిలేసి వెళ్లిపోదాం అనిపించిందని.. మరోపక్క నిర్మాణ వ్యయం కూడా బాగా ఎక్కువైపోయింది అని, ఆ ఒక్క సినిమాలోనే తనకు ఏకంగా రూ.32 కోట్లు పోయాయి” అని అశ్వినీదత్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Also Read:కార్ల్ మార్క్స్…జయంతి

నిజానికి పదేళ్ల క్రితమే.. ఒక్క సినిమాతో రూ.32 కోట్లు నష్టపోవడం అంటే చాలా పెద్ద విషయమే. అపుడు రూ.32 కోట్లు అంటే.. ఇప్పుడు దాని విలువ 50 కోట్లు పైమాటే. నిజంగా అశ్వినీదత్ లాంటి సీనియర్ నిర్మాత కాబట్టే.. అంత పెద్ద నష్టం జరిగినా తిరిగి ఆయన కోలుకున్నారు. ప్రస్తుతం ప్రాజక్ట్ కె లాంటి పాన్ ఇండియా సినిమాలను ఆయన నిర్మిస్తున్నారు.

Also Read:హ్యాపీ బర్త్ డే..కృష్ణ పూనియా

- Advertisement -