ఐపీఎల్ 2020 సీజన్ వేలం ముంగిట కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పంజాబ్ కెప్టెన్‌గా ఉన్న రవీచంద్రన్ అశ్విన్‌ను బదిలీచేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఢిల్లీ కేపిటల్స్-పంజాబ్ మధ్య ఒప్పందం కుదిరింది. అశ్విన్‌కు ఢిల్లీకి బదిలీ చేయడం ద్వారా ఆ జట్టు నుంచి ఇద్దరు ఆటగాళ్లను దక్కించుకునేలా పావులు కదుపుతోంది.
అయితే పంజాబ్ టీమ్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా కుంబ్లే నియామకం అయిన తర్వాత అశ్విన్ బదిలీపై వెనక్కి తగ్గినట్లు కనిపించిన పంజాబ్ ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. సీనియర్ బౌలరైన అశ్విన్‌ని తమ టీమ్‌లోకి తీసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్పష్టం చేశాడు.ఇక 2019లో శిఖర్ ధావన్‌ని బదిలీ రూపంలో దక్కించుకున్న ఢిల్లీ ఈ సారి అశ్విన్‌ను దక్కించుకుంది.
2019 సీజన్‌లో 14 మ్యాచ్‌లాడి 15 వికెట్లు పడగొట్టిన అశ్విన్ జట్టుని ప్లేఆఫ్‌కి చేర్చడంలో విఫలమయ్యాడు. లీగ్ దశలోనే ఇంటిబాట పట్టిన పంజాబ్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. డిసెంబరు 19న కోల్‌కతా వేదికగా ఆటగాళ్ల వేలం జరగనుంది.