దిల్‌రాజుతో సురేందర్‌ రెడ్డి…హీరో ఎవరో తెలుసా..!

328
surender reddy

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వలో తెరకెక్కిన చిత్రం సైరా. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు భారీ వసూళ్లను రాబట్టింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను వెండితెరపై విజువల్‌ వండర్‌లా తెరకెక్కించడంలో సక్సెస్ అయిన సురేందర్ రెడ్డి తన నెక్ట్స్ ప్రాజెక్టుపై దృష్టిసారించాడు.

ప్రస్తుతం హాలీడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్న సురేందర్ రెడ్డి తిరిగి వచ్చాక తన తర్వాతి సినిమాను ప్రకటించనున్నాడు. దిల్ రాజు నిర్మాతగా ప్రభాస్ హీరోగా సినిమాను తెరకెక్కించే ప్లాన్లో ఉన్నాడట సురేందర్‌ రెడ్డి. ప్రస్తుతం ఈ వార్త టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారగా దిల్ రాజు సైతం ప్రభాస్‌ డేట్స్‌ కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రాధకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ కోసం రెడీ అవుతున్నాడు ప్రభాస్‌. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నాడట. యూవీ క్రియేషన్స్‌తో కలిసి గోపీ కృష్ణ మూవీస్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది.