సమంతా డూప్ అదరిపోలే….

217
Tollywood,Samantha,Ashu Reddy,look llike,Samantha ruth prabhu
- Advertisement -

మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. అయితే, తమను పోలిన ఇతర వ్యక్తులను కలుసుకోవటం చాలా అరుదుగా జరుగుతుంది. ఇక సెలబ్రిటీల విషయంలో ఇది చాలా అరుదు. మహాత్మగాంధీ,ప్రధానమంత్రి నరేంద్రమోడీ దగ్గరి నుంచి అబ్దుల్ కలాం,సల్మాన్‌ ఖాన్,షారుఖ్,తమన్నా,బాబా రాందేవ్‌ డూప్స్‌ ఫోటోలు గతంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

తాజాగా ఇప్పుడు అలాంటి మరో సెలబ్రిటీ డూప్‌ ప్రత్యక్షమైంది. ఏంమాయ చేశావే అంటూ కుర్రకారు గుండెను దోచేసిన సమంతా … నాగ్ ఇంటికి కోడలు కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె ఎంగేజ్ మెంట్ పూర్తిచేసుకున్న ఈ జంట త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఎంగేజ్‌ మెంట్ తర్వాత కూడా మూడు సినిమాలకు సామ్ కమిట్ కావడంతో అంతా ఆశ్చర్యపోయారు.

ఇప్పుడు అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే  సమంతను ఓ పోలిన అమ్మాయికి.. ఆన్ లైన్ లోతెగ క్రేజ్ పెరిగిపోతోంది. అషు రెడ్డి అనే అమ్మాయి అచ్చుగుద్దినట్లుగా సమంత పోలికల్లోనే ఉంది. అచ్చు సమంతలాగే ఫోజులు ఇస్తూ ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ లో ఈమె తెగ హల్ చల్ చేసేస్తోంది. అంతే కాదు సమంత పలికిన ఫేమస్ డైలాగ్స్ కు డబ్ స్మాష్ చెప్పి.. తన ఫాలోయర్స్ ను తెగ పెంచేసుకుంటోంది అషు రెడ్డి.

ఇప్పటికే ఈమెకు 40వేల మంది ఫాలోయర్లు ఉన్నారంటే క్రేజ్ ఏ రేంజ్ లో పెరుగుతోందో అర్ధమవుతుంది. వీటిని చూసేందుకు సమంత ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తి చూపుతున్నారు. సమంత ప్రస్తుతం విజయ్ 61వ మూవీతో పాటు చరణ్- సుకుమార్ కాంబోలో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉంది.

- Advertisement -