తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు జనవరి 22న జరగనున్న ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల గెలుపుకు ఎన్నారై తెరాస యుకే ప్రత్యేక కృషి చేస్తుందని అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మీడియాకు తెలిపారు.
నేడు తెలంగాణ రాష్ట్రం నుండి వివిధ దేశాల్లో ఎంతో మంది ప్రవాసబిడ్డలు స్థిరపడ్డారని, నాటి తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు కెసిఆర్ వెంటే ఉంటూ వారి నాయకత్వాన్నీ బలపర్చుతున్నారని, అదే స్పూర్తితో నేటి మున్సిపల్ ఎన్నికల్లో సైతం మీ కుటుంబసభ్యులకి , మిత్రులకి ఫోన్ చేసి తెరాస అభ్యర్థుల గెలుపుకు కృషి చెయ్యాలని ఖండాంతరాల్లో నివసిస్తున్న ఎన్నారైలకు పిలుపునిచ్చారు.
ఎన్నికలేవైనా ఎన్నారై తెరాస సభ్యులు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే, అలాగే నేటి మునిసిపల్ ఎన్నికల్లో సైతం ప్రత్యేక ప్రణాళికతో తెరాస అభ్యర్థుల గెలుపుకోసం లండన్ బృందం కృషిచేస్తుందని అశోక్ గౌడ్ తెలిపారు.
యావత్ భారత దేశంలో సమర్ధవంతమైన నాయకత్వం ఉన్న రాష్ట్రం కేవలం తెలంగాణ రాష్ట్రమేనని, ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచామని, కేటీఆర్ అటు మంత్రిగా ఇటు తెరాస కార్యనిర్వాహణ అధ్యక్షులుగా రాష్త్రానికి ఎన్నో సేవలందిస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలల్లో తెరాస జెండా ఎగిరేలా ప్రజలంతా విజ్ఞతతో అలోచించి తెరాస అభ్యర్థులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా ప్రతిపక్షాలని ఎప్పుడో మర్చిపోయారని ఎన్నిక ఏదైనా ప్రజలంతా కెసిఆర్ వెంటే ఉన్నారని తెలిపారు.