బాలయ్య సరసన ‘నాగార్జున హీరోయిన్’

30
- Advertisement -

బాలయ్య బాబు – దర్శకుడు బాబీ కాంబినేషన్ లో కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై త్వరలోనే కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకోబోతుంది ఈ మూవీ. తాజాగా చిన్నపాటి ఫోటో షూట్ కూడా నిర్వహించారు. ఇప్పుడీ సినిమాకు హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. బాలయ్య – బాబీ సినిమాలో హీరోయిన్ గా ఆషికా రంగనాథ్ ను తీసుకున్నారు. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ లో పాగా వేయబోతుంది. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఆషికా రంగనాథ్ ఫొటోలు కూడా ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. నిజానికి ఈ సినిమా కోసం ఓ పెద్ద హీరోయిన్ ను అనుకున్నారు.

కుదిరితే నయనతారను తీసుకొని క్రేజీ మేజిక్ ను రిపీట్ చేద్దాం అనుకున్నారు. కుదరకపోతే నిర్మాత నాగవంశీ కు ఇష్టమైన పూజాహెగ్డేను తీసుకోవాలని కూడా భావించారు. కానీ బడ్జెట్ లెక్కలేసుకున్న తర్వాత చిన్న హీరోయిన్ తో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అలా ఆషికా రంగనాథ్ తెరపైకొచ్చింది. అటు బాలయ్య బాబుకు కూడా కొత్త హీరోయిన్లతో పని చేయడం కొత్తేంకాదు. ఇప్పటికే, ఎంతోమందికి ఛాన్స్ లు ఇచ్చాడు. ఇప్పుడీ లిస్ట్ లోకి ఆషికా రంగనాథ్ కూడా చేరిందంతే. ఐతే, ఆషికా రంగనాథ్ ప్రస్తుతం ‘నా సామిరంగ’ సినిమాలో నటిస్తోంది.

నాగార్జున, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సంక్రాంతికి రాబోతుంది. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకు విజయ్ బిన్ని దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పై బాగానే అంచనాలు ఉన్నాయి. పైగా ఆషికా రంగనాథ్ పాత్ర కూడా బాగానే పేలింది. అందుకే, ఆమెకు బాలయ్య కొత్త సినిమాలో అవకాశం వచ్చింది. అన్నట్టు, బాలయ్య సినిమాకు సంగీత దర్శకుడిగా తమన్ పేరే వినిపిస్తోంది.

Also Read:స్టోన్ ఫ్రూట్స్ తో క్యాన్సర్ కు చెక్!

- Advertisement -