Talasani:జూన్ 22 నుండి ఆఫాడ బోనాలు

17
- Advertisement -

జూన్ 22 నుండి ఆషాడ బోనాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జూన్ 22న గోల్కొండలో ఆషాడ బోనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలోని హరిత ప్లాజాలో బోనాల ఏర్పాట్లపై మంత్రులు మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు తలసాని.

ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని..జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు , వచ్చే 10న రంగం నిర్వహిస్తామని తెలిపారు. జులై 16న ఓల్డ్ సిటీ బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు ఉంటుందన్నారు. బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందని తెలిపారు.

Also Read:కాంగ్రెస్ పాలనలో అన్ని పెండింగే..

తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను సీఎం కేసీఆర్‌ రాష్ట్ర పండుగగా ప్రకటించారని చెప్పారు. మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

- Advertisement -