మహాకూటమి..మోడ్రన్ ఈస్ట్ ఇండియా కంపెనీ

201
owaisi
- Advertisement -

మహాకూటమి..ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఎద్దేవా చేశారు హైదరాబాద్ ఎంపీ,మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. కాంగ్రెస్,టీడీపీ పార్టీలు ఈస్ట్ ఇండియా కంపెనీని తలపిస్తున్నాయని మండిపడ్డారు. సంగారెడ్డిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అసద్..చంద్రబాబు,కాంగ్రెస్‌తో జతకట్టడం ఏంటని ప్రశ్నించారు.

తెలంగాణను రాష్ట్ర సంస్కృతిని చంద్రబాబు పరిరక్షిస్తారా లేక కాంగ్రెస్ ఆ బాధ్యత తీసుకుంటుందా అని చెప్పారు. తెలంగాణలో ఎంఐఎం బలంగా ఉందని ..యూపీ, బిహార్, కర్ణాటక ఎన్నికల్లో ముస్లింలు సత్తా చాటారని ఆయన చెప్పారు. ఎంఐఎం నేతలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు.

విజయవాడలో ఉన్న చంద్రబాబు, నాగ్‌పూర్‌లో ఉన్న ఆర్ఎస్ఎస్, లేక ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ తలరాత ఇక్కడి ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తారా? తెలంగాణ తలరాతను ఇక్కడి ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. అంతేకానీ విజయవాడ, నాగ్‌పూర్, ఢిల్లీల నిర్ణయం ఇక్కడ చెల్లదన్నారు. ఈ మోడ్రన్ ఈస్ట్ ఇండియా కంపెనీని డిసెంబర్ 7న వారి ప్రాంతాలకు తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

- Advertisement -