ఉగ్రవాదానికి మద్దతుగా పాక్‌:అసద్

10
- Advertisement -

ఉగ్రవాదానికి పాక్‌ మద్దతిస్తోంది అని ఆరోపించారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. అంతర్జాతీయ స్థాయిలో పాక్‌ నిజస్వరూపాన్ని బయటపెడతాం అని హెచ్చరించారు. కేంద్రం అప్పగించినబాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తాం అని అన్నారు. ఆపరేషన్‌ సింధూర్‌పై ఏర్పాటు చేసిన అఖిలపక్షంలో అసదుద్దీన్‌కు చోటు కల్పించింది కేంద్రం.

పాకిస్థాన్ చేస్తున్న హింసను ప్రపంచం ముందు ఉంచడమే తన ప్రధాన ఉద్దేశమన్నారు. భారత్‌లో 20 కోట్లకు పైగా ముస్లింలు నివసిస్తున్నారు..వారందరిని తప్పుగా చూడటం సరికాదన్నారు.

భారత్ సహనం ఇక ముగిసింది…1947లో జమ్మూ కాశ్మీర్‌పై గిరిజనుల దాడితో మొదలైన పాకిస్థాన్‌ కుట్రలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడితో మన సహనం నశించింది… ఇకపై ఈ విధ్వంసాన్ని సహించం అని హెచ్చరించారు. దేశంలో విభజన సృష్టించడం, ఆర్థిక అభివృద్ధిని అడ్డుకోవడం వారి కుట్రలో భాగం అని…పాకిస్తాన్‌పై యుద్ధం కొనసాగుతుందన్నారు.

Also Read:పుదీనాతో ఇంటి వైద్యం…..

- Advertisement -