- Advertisement -
బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పించారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. గుజరాత్‌లో గత కొన్నేళ్లుగా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని బిజెపి నేతలు దాడులు చేస్తూనే ఉన్నారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
ద్వారకాలో అక్రమ కట్టడాల పేరుతో ముస్లింల ప్రార్థనా మందిరాలను కూల్చేస్తున్నారు. ఖబ్రస్థాన్‌లు (స్మశాన వాటికలు) తొలగిస్తున్నారు. వారు సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం అమానుషంగా ఉల్లంఘించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుజరాత్‌లో వారు కూల్చివేసిన దర్గాలు, ఖబ్రస్థాన్‌లు సైతం ప్రభుత్వ రికార్డుల్లో గుర్తించినవే. దేవ భూమిలో ముస్లింల ప్రార్థనా స్థలాలు ఉన్నయని చెబుతున్న ప్రభుత్వం ఇప్పటివరకు చట్టప్రకారం సవాల్ చేయలేదు అని దుయ్యబట్టారు. న్యాయ ప్రకారం ఈ కూల్చి వేతలు జరగలేదు. ఈ అన్యాయమైన చర్యను ఖండిస్తున్నాను అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
Also Read:రవితేజ.. ‘మాస్ జాతర’
- Advertisement -