ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి ప్రశంసలు గుప్పించారు ఎంఐఎం చీఫ్,ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఓవైసీ తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో ఫస్ట్ లిస్ట్ ప్రకటించామని తెలిపిన ఓవైసీ..కొన్నిప్రాంతాల్లో టీఆర్ఎస్‌తో స్నేహపూర్వక పోటీ ఉంటుందని చెప్పారు. ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే అంశంపై అతిత్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
కేసీఆర్ పాలనలో మతకలహాలు జరిగిన దాఖలాలు లేవని…అందుకే కేసీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతారని చెప్పారు. సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తున్న ఘనత టీఆర్ఎస్‌కే దక్కుతుందన్నారు. షాదీ ముబారక్ పథకం ముస్లింలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
పవర్ పాలిటిక్స్‌కు ఎంఐఎం దూరమని చెప్పారు అసద్. టీఆర్ఎస్ మంత్రివర్గంలో చేరమని అదే విషయాన్ని అక్బర్ చెప్పారని గుర్తుచేశారు. బలహీనవర్గాలు,దళితులు,మైనారిటీల సంక్షేమమే ఎంఐఎం ఎంజెండా అన్నారు. తాము పోటీ చేయని నియోజకవర్గాల్లో ప్రజలు టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉంటారని తెలిపారు.