నామినేషన్ వేసిన అసద్‌..

240
Asaduddin owaisi Files the Nomination
- Advertisement -

హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ నామినేషన్‌ దాఖలు చేశారు. సోమవారం ఎంఐఎం నాయకులు,కార్యకర్తలతో కలిసి వెళ్లిన అసద్‌ రిటర్నింగ్‌ అధికారిగా ఉన్న హైదరాబాద్‌ కలెక్టర్‌ మాణిక్‌రాజ్‌ కన్నన్‌కు నామినేషన్‌ పత్రాలను ఓవైసీ సమర్పించారు.

హైదరాబాద్‌ ఎంపీ స్ధానం మజ్లిస్ కంచుకోట. 1984 నుండి హైదరాబాద్‌ ఎంపీ స్ధానాన్ని తిరుగులేని మెజార్టీతో గెలుస్తూ వస్తోంది ఐఎంఐఎం.1984లో అసద్ తండ్రి సలావుద్దీన్ ఓవైసీ ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలుపొందారు. తర్వాత ఎంఐఎంను స్ధాపించిన ఓవైసీ ఐదుసార్లు హైదరాబాద్ ఎంపీగా గెలుస్తూ వచ్చారు.

ఓవైసీ రాజకీయ వారసుడిగా పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టిన అసద్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత వరుసగా మూడు సార్లు 2004 ,2009, 2014 ఎన్నికల్లో హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అసదుద్దీన్‌ ఓవైసీ పోటీ చేసి గెలుపొందారు. తాజాగా టీఆర్ఎస్ మద్దతుతో బరిలో దిగుతున్న అసద్ గెలుపు నల్లేరుపై నడకే కానుంది.

ఈ నెల 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఈ నెల 28. లోక్‌సభ ఎన్నికలకు ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరగనుంది.

- Advertisement -