- Advertisement -
పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఈ ఘటనలో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది అని మండిపడ్డారు. దాడిలో విదేశీయులు సైతం మరణించడం చాలా బాధాకరం.. పుల్వామా కంటే ఇది అతిపెద్ద ఘటన అన్నారు.
దీనిపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాలి… భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి అని కోరారు అసదుద్దీన్ ఓవైసీ.
Also Read:ఆటా ఆధ్వర్యంలో ధరిత్రి దినోత్సవం
మరోవైపు జమ్మూలోని బారాముల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. LOC దగ్గర చొరబాటుకు ఉగ్రవాదులు ప్రయత్నించగా ఇద్దరు ఉగ్రవాదులను హతం చేశాయి భద్రతా బలగాలు. వారి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -

