సంయమనం పాటించండి: ఓవైసీ

29
Asaduddin Owaisi
- Advertisement -

మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. దాంతో పాతబస్తీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత ఓవైసీ స్పందించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తిని జైలుకు పంపాలన్నదే మా డిమాండ్. రాజాసింగ్ అరెస్టయ్యి.. జైలుకు కూడా వెళ్లారు కాబట్టి ముస్లింలు అంతా సంయమనం పాటించాలని సూచించారు ఓవైసీ. ఇతరులను బాధపెట్టే ఘటనలు జరగకుండా చూసుకోవడం మన బాధ్యత అని తెలిపారు. శుక్రవారం నమాజ్ తర్వాత ముస్లింలు సంయమనం పాటించాలని కోరారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని.. ముస్లింలు శాంతియుతంగా ఉండాలని కోరారు.

ఇక మరోవైపు రాజాసింగ్ అరెస్ట్‌కు నిరసనగా బేగంబజార్, ముక్తార్ గంజ్, మహారాజ్ గంజ్, కిషన్ గంజ్ మార్కెట్‌లోని దుకాణాలను స్వచ్ఛందంగా బంద్ చేశారు. పాతబస్తీలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ర్యాలీలు, ధర్నాలకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు.

- Advertisement -