సార్ మీరే సీఎం..కేసీఆర్‌కు అసద్‌ ఫోన్

228
asad-kcr
- Advertisement -

తెలంగాణలో మళ్లీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు ఎంఐఎం చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఆదివారం కేసీఆర్‌కు ఫోన్ చేసిన అసద్…మళ్లీ మీరే సీఎం అవుతారని చెప్పారు.

ఎన్నికల సరళి, పోలింగు ఇతర అంశాలపై చర్చించుకున్నారు. మజ్లిస్‌ పార్టీ టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వడం, తమ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడంపై సీఎం కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఆదరించారని, విపక్ష కూటమిని తిప్పికొట్టారని కేసీఆర్‌ అన్నారు.

టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మీ విజయానికి కారణమయ్యాయని, మైనారిటీల సంక్షేమానికి చేపట్టిన పథకాలకు విశేషాదరణ లభించిందని అసద్ ఈ సందర్భంగా కేసీఆర్‌తో అన్నారు. రాష్ట్రమంతటా గులాబీ హోరే వినిపించిందని… ప్రజలు తెలంగాణ స్వాభిమానాన్ని చాటారని కేసీఆర్ చెప్పారు. మేం ఊహించిన విజయాన్ని అందుకుంటాం. మళ్లీ మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -