పూర్తిస్ధాయి మెజార్టీతో కేసీఆరే సీఎం:అసద్

327
kcr asad
- Advertisement -

సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి మెజార్టీ సాధిస్తుందని జోస్యం చెప్పారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. టీఆర్ఎస్‌కు అండగా మజ్లిస్ అంటుందని స్పష్టం చేశారు. మరికాసేపట్లో కేసీఆర్‌ని కలవబోతున్నానని ట్వీట్ చేసిన ఓవైసీ జాతి నిర్మాణం లక్ష్యం దిశగా ఇది మా తొలి అడుగు అని ట్వీట్ చేశారు.

మరోవైపు రేపు ఫలితాలు వెల్లడికానుండగా సర్వ్తత్రా ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా లేదా అన్న అంశంతో పాటు అభ్యర్థుల గెలుపు,మెజార్టీపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ముఖ్యంగా నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని,కొడంగల్ రేవంత్ రెడ్డి స్థానాల్లో ఎవరు గెలుస్తారో అన్న దానిపై పందేం రాయుళ్లు బెట్టింగ్ కాస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -