గంగా-జమునా తెహజీబ్ తెలంగాణ ప్రత్యేకత ఎంపి అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో మాట్లాడటం ఆనందంగా ఉందన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందని తెలిపారు. తెలుగు ఉర్దు భాషల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.
సోదరి సోదరిమణులారా అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఓవైసీ ప్రసంగం ఆధ్యంతం తెలుగులో మాట్లాడి అబ్బుర పరిచారు. ప్రపంచ తెలుగు మహాసభలు మన హైదరాబాద్‌లో నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. తెలుగు భాషాభివృద్ధికి మన ముఖ్యమంత్రి చాలా కృషి చేస్తున్నారు.
ఈ హైదరాబాద్‌లో కుతుబ్ షా కాలం నుంచి హిందూ, ముస్లింలు పాలు, నీళ్లలా కలిసిమెలసి జీవిస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర హిందూ, ముస్లింల ఐకమత్యానికి ఉదాహరణగా నిలుస్తోంది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది” అని అన్నారు. తన మాటల్లో తప్పులు ఉంటే క్షమించాలని తన ప్రసంగాన్ని ముగించారు.