శృంగారంలో పాల్గోనలేదని తన భార్య ను గొంతు కోసి చంపేశాడు ఓ వ్యక్తి. తాజాగా జరిగిన ఈఘటన సంచలనం రేపుతుంది. ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఈదారుణమైన ఘటన చోటుచేసుకుంది. తనతో శృంగారం చేయడానికి నిరాకరించిందని గోపిగించిన భర్త ఆమెతో గొడవపడి పక్కనే కత్తితో భార్య గొంతుకోసేశాడు ఆ దుర్మార్గపు భర్త.
అజయ్ అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా నోటీ క్యాన్సర్ ఉండటంతో గత కొద్ది రోజులుగా పనికి వెళ్లకుండా ఇంటివద్దే ఉంటున్నాడు. అజయ్ ఇంట్లోనే ఉండటంతో ఆయన భార్య మమత ఏదైనా ఉద్యోగంకోసం ట్రై చేస్తూ తన నోయిడాలోని తన సోదరుడి ఇంటికి వెళ్లింది. కొద్ది రోజుల నుంచి అక్కడే ఉంటున్న మమత దగ్గరకు అతని భర్త అజయ్ వచ్చాడు.
దింతో భార్య వద్దకు వచ్చిన అజయ్ శృంగారంలో పాల్గోనాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అతనికి క్యాన్సర్ ఉండటంతో ఆమె నిరాకరించింది. దింతో కోపానికి గురైన అజయ్ ఏం చేయాలో అర్ధంకాక అక్కడే ఉన్న కత్తితో తన భార్య గొంతు కోసి పరారయ్యాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న నోయిడా పోలీసులు అజయ్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.