డ్రగ్ కేసులో బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ పట్టుబడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్యన్ ఎన్సీబీ కస్టడీలో ఉన్నాడు.. అయితే ఆర్యన్ బెయిల్ కోసం అప్పీల్ చేసుకోగా పిటిషన్‌ను ముంబై కోర్టు తిరస్కరించింది. ఆర్యన్‌తోపాటు అర్బాజ్ దమేచాలను కూడా ఎన్సీబీ కస్టడీకి అప్పగిస్తూ తీర్పిచ్చింది. కోర్టులో ఆర్యన్ తరఫున ప్రముఖ న్యాయవాది సతీశ్ మనేషిండే వాదనలు వినిపించారు. ఇతరుల దగ్గర డ్రగ్స్ దొరికితే ఆర్యన్‌కు సంబంధం లేదని సతీశ్ వాదించారు.
అయితే అన్ని ఆధారాలూ ఉన్నందునే వారిని అదుపులోకి తీసుకున్నామని ఎన్సీబీ కోర్టుకు తెలిపింది. ఆర్యన్, అతని మిత్రుల నుంచి మరిన్ని కీలక విషయాలు రాబట్టాలంటే తమకు మరింత సమయం కావాలని కోరింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ఆర్యన్‌తోపాటు అతని స్నేహితులు అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ దమేచాల బెయిలు పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ నెల 7వ తేదీ వరకూ వారిని ఎన్సీబీ కస్టడీకి అప్పగించింది. మరోవైపు అరెస్ట్ చేసిన సమయం నుంచి ఆర్యన్ ఖాన్ ఒకటే ఏడుస్తున్నాడని తెలుస్తుంది. కొడుకు ఆర్యన్‌తో షారుక్ ఖాన్ మాట్లాడాడని.. ధైర్యం చెప్పాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ కేసు ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.