- Advertisement -
ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు నిరాశే ఎదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ముంబై సెషన్స్ కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం ఆర్యన్ తో పాటు అర్బాజ్ మర్చంట్, మరో ఆరుగురు ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నారు.
ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయి జైల్లో ఉన్నారు ఆర్యన్. ముంబై క్రూయిజ్ పార్టీ సందర్భంగా ఓ వర్థమాన నటితో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ చాట్ చేసినట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) వెల్లడించింది.
- Advertisement -