కర్ణాటక బీజేపీపై సంచలన కామెంట్స్ చేశారు ఆ పార్టీ నేత, మాజీ మంత్రి అరవింద్ లింబావళి. ప్రతిపక్షంగా తమ పార్టీ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రభలుతున్న డెంగ్యూ, భారీ వరదలు వంటి అనేక సమస్యలను తమ పార్టీ నేతలు అసెంబ్లీలో సమర్ధవంతంగా ప్రజెంట్ చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్ అశోక మధ్య సఖ్యత, అవగాహన లేకపోవడం విచారకరమని… ముడా కుంభకోణం, వాల్మీకి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన గ్రాంట్‌ల దుర్వినియోగం పై బీజేపీ నేతలు మాట్లాడలేదన్నారు.
ప్రభుత్వ కుంభకోణాలు, నిధుల దుర్వినియోగం, వైఫల్యాలను ఎత్తిచూపడానికి సభలో బీజేపీకి అవకాశం ఉన్నప్పటికీ, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో మా నాయకులు పూర్తిగా విఫలమయ్యారు. తమ పార్టీ ప్రస్తుత పరిస్థితికి తాను చాలా ఆందోళన చెందుతున్నానని వెల్లడించారు.
Also Read:ఇందిరా పార్కు వద్ద నేతన్నల ధర్నా