- Advertisement -
జ్వరం,గొంతునొప్పితో బాధపడుతున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్వీయ నిర్భందం విధించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ అధికారులు కరోనా టెస్టు చేశారు.ఉదయం కేజ్రీవాల్ నుంచి నమూనాలు సేకరించింది ఆరోగ్య శాఖ బృందం.రెండు రోజుల నుంచి జ్వరం, స్వల్ప గొంతునొప్పితో బాధపడుతున్న కేజ్రీవాల్‌కు ప్రస్తుతం జ్వరం తగ్గినట్లు వెల్లడించారు అధికారులు.
మరోవైపు కరోనా మహమ్మారి కాటుకు ఢిల్లీ విలవిల్లాడుతోంది. ప్రతిరోజు వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదవడంతోపాటు మరణాల సంఖ్య కూడా కలవరపెడుతోంది. ఇప్పటివరకు 27 వేలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా 761మంది బలైపోయారు.
- Advertisement -