ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరు చేయడం, రిలీజ్ తర్వాత బ్లాక్‌బస్టర్ అయినప్పడు ఆ పాత్ర చేయలేకపోయానని బాధ పడటం మామూలే. రీసెంట్‌గా కన్నడ నటి ప్రేమ ఓ ఇంటర్వ్యూలో అరుంధతి సినిమాకు మొదట్లో కోడి రామకృష్ణ ఆమెను సంప్రదించినట్లు వెల్లడించింది. ఆ టైమ్‌లో వేరే సినిమాలతో బిజీగా ఉండటం, ఆ క్యారెక్టర్‌పై అనుష్క పేరు రాసుండటంతో ఆ ఛాన్స్ అనుష్కను వరించిందని ప్రేమ చెప్పుకొచ్చింది. మొత్తానికి మాజీ హీరోయిన్ ప్రేమ చెప్పిన ఈ ముచ్చట్లకు నెటిజన్లు షాక్ అవుతున్నారు.
కారణం.. అనుష్క శెట్టికి ఈ సినిమాతోనే లైఫ్ వచ్చింది. అరుంధతి చిత్రం 2009లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలై ఘన విజయం సాధించింది. అనుష్క, సోనూ సూద్, అర్జన్ బజ్వా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా వసూళ్ళతో పాటు ఏడు విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలని అందుకుంది. అరుంధతి సినిమా నిర్మాణానికి 14.5 కోట్ల రూపాయలు ఖర్చయింది. అయితే ఈ భారీ చిత్రాన్ని కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు సరిగా ముందుకు రాకపోవడం, వచ్చినవారు కూడా నిర్మాత లాభాలు కళ్ళజూసే రేటు చెప్పకపోవడంతో శ్యాంప్రసాద్ రెడ్డి స్వయంగా అన్ని ఏరియాల్లోనూ విడుదల చేశారు.
మొదటి రోజు మొత్తం 35 ప్రింట్లతో సినిమాను విడుదల చేయగా, మరుసటి వారానికి 290 ప్రింట్లకు, ఆపై వారం 360 ప్రింట్లకు పెరిగి 2009 సంక్రాంతి హిట్ గా నిలిచింది. ఆ రోజుల్లోనే దాదాపు 20 కోట్లను లాభలను తెచ్చి పెట్టింది. అరుంధతి సినిమా విజయంలో గ్రాఫిక్స్ వర్క్, స్పెషల్ ఎఫెక్ట్స్ వంటివే కీలకమైనవి. దాంతో సినిమాకు స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాన్ని నడిపించే రాహుల్ నంబియార్ కి క్రియేటివ్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు. ఏది ఏమైనా నటి ప్రేమ గొప్ప సినిమాని మిస్ అయింది.
ఇవి కూడా చదవండి…