గ్రామీణ ప్రాంతాల్లో బడ్జెట్‌ను ఎక్కువగా ఖర్చు చేస్తామని … పేదరిక నిర్మూలనే మా ప్రధాన లక్ష్యమని అరుణ్ జైట్లీ తెలిపారు. రూ.10 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇస్తామని …. 60 రోజుల్లోపు రుణాలు చెల్లిస్తే రైతులకు పూర్తి వడ్డీ రాయితీ ఇస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో బడ్జెట్ ను ఎక్కువ ఖర్చు చేస్తామన్నారు.
()పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు. పాల కేంద్రాలను పాలవెల్లువ పథకం కింద రూ.8వేల కోట్లతో పాలసేకరణ కేంద్రాల స్థాపన.
()రైతులకు రూ.10లక్షల కోట్లను రుణాలుగా ఇవ్వాలన్న లక్ష్యం.
()సాగునీటి రంగానికి ప్రత్యేకనిధి.
()రైతులకు అండగా ఫసల్ బీమా యోజనను 30శాతం నుంచి 40శాతానికి పెంచుతున్నాం.
()రైతుల సంక్షేమ, గ్రామీణ ఉపాధి, యువత, మౌలిక సౌకర్యాలు, పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ సుపరిపాలన, విత్త విధానం, పన్ను సంస్కరణలు, నిజాయితీ పనులకు పెద్దపీట.
()రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో కలిపివేశాం. రైల్వేల స్వతంత్ర ప్రతిపత్తి కొనసాగుతుంది.
()గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టడంతో పాటు మౌలిక సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం.
()పెద్దనోట్ల రద్దుతో బ్యాంకుల్లో నగదు నిల్వలు పెరిగాయి. దీంతో మరికొందరికి రుణాలిచ్చే సౌకర్యం కలుగుతుంది. వడ్డీ రేట్లు తగ్గుతాయి
()పెద్దనోట్ల రద్దు సాహసోపేతమనైన చర్య.
()రెండోవది పెద్దనోట్ల రద్దుపై చర్యలో ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోంది.
()గత రెండు సంవత్సరాలుగా ఆర్థిక సంస్కరణలు వేగవంతంగా ఉన్నాయి. ఇందులో జీఎస్‌టీ ఒకటి.
()సంప్రదాయానికి భిన్నంగా నెల రోజుల ముందుగానే ప్రవేశపెట్టారు.
()2017లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కోలుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి.
() ఈ ప్రభుత్వం సంపూర్ణ పారదర్శక విధానాలను అమలు చేస్తోంది.
() విదేశీ మారక ద్రవ్యనిల్వలు 361 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
()భారత్ ఉత్పాదక రంగంలో ప్రపంచంలో 9వ స్థానం నుంచి 6వ స్థానానికి ఎగబాకింది.