న్యూజెర్సీలోని నెవార్క్ లోని లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళకి చుక్కెదురైంది. పెంపుడు పక్షి నెమలిని తనతోపాటు విమానంలో తీసుకెళ్దామనుకున్నమహిళను యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన ప్రతినిధులు అడ్డుకున్నారు. దానికి కారణం ఆ నెమలి పరిమాణంలో, బరువులో ఎక్కువగా ఉండడంతోనే అనుమతించలేదని వారు స్పష్టం చేశారు.
న్యూజెర్సీలోని నీవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ తన పెంపుడు నెమలితో వచ్చింది. తనతో పాటు నెమలికి కూడా ప్రయాణ టికెట్ తీసకుంటానని యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు ఆవిడ వివరించింది. అయినప్పటికీ సిబ్బంది నెమలిని విమానం ఎక్కించేందుకు నిరాకరించారు.
పైగా ఆ మహిళ టికెట్ డబ్బును వెనక్కి ఇవ్వడంతోపాటు ఆమె విమానాశ్రయం నుంచి హోటల్‌కు వెళ్లడానికి అయ్యే డబ్బు కూడా చెల్లించింది.
‘ఎమోషనల్ సపోర్ట్ యానిమల్’ అని జంతువులకు కూడా కొన్ని షరతులతో విమానంలో ప్రయాణించడానికి అనుమతి ఇస్తున్నారు. అయితే ఈ నెమలి నిబంధనలకు అనుగుణంగా లేదని, సైజు బరువు చాలా ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఆ నెమలి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.