సల్లూబాయ్‌ని చంపడానికి కుట్ర..

272
- Advertisement -

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ హత్యకు కుట్ర జరుగుతున్నది. ఈ విషయాన్ని హరియాణా పోలీసులు వెల్లడించారు. గతంలో కృష్ణజింకను వేటాడి చంపిన కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ హత్యకు ప్రణాళిక రచించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే గ్యాంగ్‌కు చెందిన సంపత్‌ నెహ్రా సల్యాన్‌ను చంపడానికి పథకం వేశాడని పోలీసులు వెల్లడించారు. హరియాణా, రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాల పోలీసులకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న గ్యాంగ్‌స్టర్‌ సంపత్‌ నెహ్రాను ఇటీవల హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు విచారణలో ఇతడు కీలక విషయాలు బయటపెట్టాడు.

Salman Khan

సల్మాన్‌ హత్య కోసం ఆయన ఇంటి వద్ద నెహ్రా రెక్కీ కూడా నిర్వహించాడట. ప్రస్తుతం అతడు ఆ పనిమీదే ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇందుకోసం నెహ్రా ముంబయికి కూడా వెళ్లాడట. సల్మాన్‌ ఖాన్‌ ఇంటిని, అక్కడికి వెళ్లే మార్గాలను తన ఫోన్లో ఫొటోలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య చేసిన తర్వాత దేశం విడిచి వెళ్లేందుకు కూడా నెహ్రా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు’ అని పోలీసుల విచారణలో బయటపడింది.

హరియాణాలోని ఘారానా నేరస్థుడు లారెన్స్‌ బిష్ణోయ్‌ ప్రధాన అనుచరుడు సంపత్ నెహ్రా‌. ఇతడు కూడా బిష్ణోయ్‌ వర్గానికి చెందినవాడే. అందులో భాగంగానే నెహ్రాతో కలిసి సల్మాన్‌ హత్యకు కొందరు కుట్ర చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కృష్ణజింకలను చంపిన కేసులో సల్మాన్‌కు ఇటీవల జైలుశిక్ష పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న సల్లు బాయ్‌ రేస్‌ 3 సినిమాలో బిజీగా ఉన్నాడు.

- Advertisement -