అభిమానుల మ‌ధ్య కేక్ క‌ట్ చేసిన బాల‌కృష్ణ‌..

306
balakrishna
- Advertisement -

ప్ర‌ముఖ హీరో, ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ 58వ పుట్టిన రోజు నేడు. ఈసంద‌ర్భంగా ఆయ‌న‌కు పలువురు ప్ర‌ముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షాలు తెలిపారు. ఈసారి బాల‌కృష్ణ త‌న పుట్టిన రోజు సెల‌బ్రెష‌న్స్ ను అభిమానుల మ‌ధ్య జ‌రుపుకున్నారు. హైద‌రాబాద్ లోని బ‌స‌వ‌తారకం ఇండో అమెరిక‌న్ కేన్స‌ర్ ఆసుప‌త్రి వ‌ద్ద ఆయ‌న కేక్ క‌ట్ చేశారు. ఈసంద‌ర్బంగా ఆసుప‌త్రి వ‌ద్ద‌కు భారీగా అభిమానులు చేరుకుని సెల‌బ్రేష‌న్స్ లో పాల్గోన్నారు.

balkrishna

ఇక ఉద‌యం నుంచి బాల‌కృష్ణ ఇంటి వ‌ద్ద అభిమానులు సంద‌డి చేశారు. ఇంటి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన అభిమానుల‌ను క‌లుసుకుని అనంతరం కేన్స‌ర్ ఆసుప‌త్రి వ‌ద్ద కేక్ ను క‌ట్ చేశారు. ఈసంద‌ర్భంగా బాల‌కృష్ణ మాట్లాడుతూ త‌న తల్లి తండ్రుల‌ను ఆయ‌న గుర్తు చేసుకున్నారు. నా త‌ల్లి కేన్స‌ర్ వ్యాధితో బాధ‌పడ్డారు కాబ‌ట్టి..పేద‌ల‌కు అతితక్కువ ధ‌ర‌కే కేన్స‌ర్ చికిత్స‌ను అందించాల‌నే ఉద్దేశ్యంతోనే ఈ ఆసుప‌త్రిని నెల‌కొల్పామ‌న్నారు. స‌మాజ‌మే దేవాల‌యం….ప్ర‌జ‌లే దేవుళ్లు అని చెప్పిన నా తండ్రి కాంగ్రెస్ పార్టీని మ‌ట్టి క‌రిపించి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చార‌న్నారు.

Balakrishna fans

ఈసంద‌ర్భంగా ఆసుప‌త్రికి వ‌చ్చిన ప‌లువురు ప్ర‌ముఖులు బాల‌కృష్ణ కు పుట్టిన‌రోజు శుభాకాంక్షాలు తెలిపారు. ఇక బాల‌కృష్ణ త‌న తండ్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ తీస్తున్న విష‌యం తెలిసిందే. ఈసినిమాలో ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టించ‌నున్నాడు. ఈసినిమాకు క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. త్వ‌ర‌లోనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నారు. బాల‌కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా నేడు ఎన్టీఆర బయోపిక్ ఫ‌స్ట్ లుక్ ను కూడా విడుద‌ల చేశారు.

- Advertisement -