నటి మీరామిథున్‌కు షాక్!

52
- Advertisement -

తమిళ సినీ నటి మీరా మిథున్‌కు షాక్ తగిలింది. ఆమెకు చెన్నై ఫాస్ట్ ట్రాక్ కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేసింది. అయితే కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేయటం ఇది రెండోసారి. కేసు తదుపరి విచారణ ఈనెల29కి వాయిదా పడింది.

బడుగు బలహీన వర్గాలను కించపరుస్తూ సోషల్ మీడియాలో ఆమె వ్యాఖ్యానించారనే ఆరోపణలతో గతేడాది ఆగస్టు 7వ తేదీన డీపీఐ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి వన్నియరసు గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆమెపై 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

శనివారం చెన్నైలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. కేసు విచారణకు మీరా మిథున్ హాజరు కాకపోవటంతో న్యాయమూర్తి అల్లి ఆమెపై రెండో సారి అరెస్ట్ వారంట్ జారీ చేశారు.

- Advertisement -