పాక్ సైనికుల దృష్టి మరల్చి….

261
- Advertisement -

19 మంది వీర జవాన్ల మృతికి భారత సైన్యం ప్రతికారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీరులోని ఉగ్రశిబిరాలపై లక్షిత దాడులతో మోదీ ప్రభుత్వం జాతి మనోరథాన్ని మన్నించింది. ఒక్కదెబ్బతో ‘ఖబడ్దార్‌’ అన్న నిగూఢ సందేశాన్ని పాక్‌ పాలకులకు పంపించింది.

అర్థరాత్రి 12:30 గంటలు దాటిన తర్వాత ఎల్‌ఓసీలో ఉడీ సహా పలు ప్రాంతాల్లో.. పాక్ సైన్యం దృష్టిని మరల్చడానికి భారత సైన్యం ఆర్టిలరీ కాల్పులు ప్రారంభించడంతో ఆపరేషన్ మొదలయింది. భారత సైన్యం కాల్పులను తిప్పికొట్టడంపై పాక్ సైన్యం దృష్టి కేంద్రీకరించడంతో.. భారత కమాండోలు మూడు బృందాలుగా విడిపోయి, ముందుగా నిర్ణయించిన ప్రదేశాల నుండి నేల మీద పాకుతూ ఎల్‌ఓసీ దాటి పీఓకోలోకి ప్రవేశించారు.పీఓకేలో 200 కిలోమీటర్ల పరిధిలోని నిర్దిష్ట ప్రాంతాల్లో ఈ సైనిక చర్యను నిర్వహించారు ఆపరేషన్ చాలా వరకూ ఎల్‌ఓసీకి 2 కి.మీ దూరం లోపలే జరిగింది. అయితే.. ఒక కమాండోటీం హాట్‌వాటర్ స్ప్రింగ్స్‌లో దాదాపు 3 కి.మీ. దూరం లోపలికి వెళ్లాల్సి వచ్చింది.

Untitled-1 copy

లేపా లోయ, టట్టా పానీ, బీంబార్‌లలో ఈ బ లగాలు దాడులు నిర్వహించాయి. హాట్ స్ప్రిం గ్స్, కేల్, లిపాల్లోని ఉగ్రవాదుల లాం చింగ్ ప్యాడ్లపై సైన్యానికి చెందిన 15 కోర్, బీంబార్ గలీపై సైన్యపు 16వ కోర్ దాడి చేపట్టింది. కుప్వారాకు ఎదురుగా ఉన్న నాలుగు లాంచ్ ప్యాడ్లు ఎల్‌ఓసీ నుండి కేవలం 300 మీటర్ల దూరం లోపలే ఉన్నాయి. సైనిక బలగాలు భా రీ కాల్పులతో ఈ ప్యాడ్లను ధ్వంసం చేశాయి. 200 కి.మీ విస్తృతిలో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఉగ్ర శిబిరాలపై దాడి చేసి 40 మందిని మట్టుబెట్టారు. ఈ దాడుల్లో ఉగ్రవాదులు, వారికి సహకరిస్తున్నవారు పెద్ద సంఖ్యలో మరణించారు.

GettyImages

మొత్తం ఆపరేషన్‌ను డ్రోన్ కెమెరాల ద్వారా సైనిక కేంద్రాలకు, నార్త్ బ్లాక్‌కు ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి తెల్లవారుజామున 4:30 గంటలకు తిరిగి మన భూభాగంలోకి చేరుకున్నారు. మెరుపు దాడి లక్ష్యం నెరవేరిందని, భద్రతా దళాలు పీవోకే లోపలకు ప్రవేశించి తెల్లవారేలోగా తిరిగి వచ్చేశాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.ఈ ఆపరేషన్‌లో మనవారి మృతదేహాలను లేదా గాయపడిన సహచరులను వదిలి రావొద్దని జవాన్లకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. జమ్మూకశ్మీర్‌తోపాటు మెట్రో నగరాల్లో దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న సైన్యం వారం రోజుల ముందు నుంచే పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై నిఘా పెట్టి అనుకున్నట్టుగానే ఆపరేషన్‌ ముగించింది.

 ISRO_Reuters

మొదటి సారి భారత సైన్యం ఇస్రో సాయం తీసుకుంది. అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ ఏడాది జూన్ లో కార్టోశాట్ 2సీ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఈ ఉపగ్రహం పాక్ అక్రమిత కశ్మీరులో భారత సరిహద్దులకు సమీపంలోనున్న ఉగ్రవాద శిబిరాలను ఫొటోల్లో బంధించగా, ఆ ఫొటోలను ఇస్రో సైన్యానికి అందించిది. ఈ ఫొటోల ఆధారంగా భారత సైనిక దళాలు పక్ అక్రమిత కశ్మీరులోకి ప్రవేశించి సరిహద్దులకు సమీపంలో తిష్ట వేసిన ముష్కరులను నాలుగు గంటల్లోనే వేటాడి మట్టికరిపించాయి. సైన్యానికి అత్యంత స్పష్టతతో కూడిన చిత్రాలను అందించినట్టు, ఈ చిత్రాలను కార్టోశాట్ ఉపగ్రహం తీసినట్టు ఇస్రో వర్గాలు వెల్లడించాయి.

దేశానికే నా మద్దతు:కేటీఆర్‌

పాకిస్థాన్‌ భూభాగంలోకెళ్లి మరీ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు జరపడంపై తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌ లో స్పందించిన ఆయన, పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై దాడులు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని అన్నారు. సర్జికల్ స్ట్రయిక్స్ తో దేశ మొత్తం ఆర్మీ వెంట ఉందని అర్థం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. తమకు దేశమే ముఖ్యమని, అందుకే, కేంద్ర ప్రభుత్వానికి బలంగా మద్దతునిస్తున్నాని కేటీఆర్ చేసిన ట్వీట్‌కు తెలంగాణ యువత నుంచి మద్దతు లభిస్తోంది.

- Advertisement -