ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు దేశానికి పట్టిన అసలు కరోన కాంగ్రెస్ పార్టీనే అన్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు ఉదయం ఆయన మీడియా పాయింట్ లో మాట్లాడారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కరోనా విషయంలో ప్రపంచం మొత్తం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఎప్పటికప్పుడు చర్యలు చెపడుతూ ముందుకు పోతున్నారు. ఇప్పటికే పార్క్ లు,పబ్ లు సినిమా హాల్స్ మూసివేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను ప్రజలు హర్షిస్తే కాంగ్రెస్ వాళ్లు మాత్రం అనేక ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కరోనను ఎదుర్కొనేందుకు ప్రజలు స్వచ్ఛందంగా సినిమా హాల్స్ పబ్ లు మూసివేయాలని కోరుతున్నట్లు తెలిపారు.